ప్రముఖ కంపెనీ గూగుల్ తమ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. సంస్థలోని 6 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. పనితీరు సరిగ్గాలేని సుమారు 10 వేల మందిని ఇంటికి పంపించేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గూగుల్ కొత్త పనితీరు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎంప్లాయిస్ వర్క్‌ను అంచనా వేసి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు గూగుల్ ఉద్యోగుల తొలగింపుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గత వారం ఉద్యోగుల పనితీరుపై గూగుల్ ఓ సమావేశం కూడా నిర్వహించినట్టు సమచారం. తక్కువ రేటింగ్ ఉన్న ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగాలను కోల్పోతారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. వచ్చే ఏడాది వరకు ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుందని అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్ ఏకంగా 20,000 మందిని తొలగించాలని యోచిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి