Google mistakenly deposited two crores in the hacker's account
mictv telugu

హ్యాకర్ అకౌంటులోకి పొరపాటున 2 కోట్లు జమచేసిన గూగుల్.. తర్వాత ట్విస్ట్

September 17, 2022

Google mistakenly deposited two crores in the hacker's account

పొరపాటున కొంత మంది అకౌంట్లోకి బ్యాంకులు డబ్బులు వేస్తుంటాయి. కొన్నిసాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందని ఎంత సర్దిచెప్పుకున్నా వాటి వైఫల్యం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది బ్యాంకుల వరకే పరిమితం కాలేదు. టెక్ దిగ్గజం, సాంకేతికతలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్న గూగుల్ కూడా ఈ విషయంలో భిన్నంగా ఏమీ లేదు. పొరపాటున ఓ హ్యాకర్ అకౌంటులో రూ. 2 కోట్లు జమ చేసింది. తర్వాత అయినా పొరపాటున గుర్తించిందా అంటే అదీ లేదు.

సదరు హ్యాకర్ బహిరంగంగా వెల్లడించేవరకు జరిగిన ఘోర తప్పిదాన్ని గుర్తించలేకపోయింది. వివరాలు.. శ్యామ్ కర్రీ అనే హ్యకర్ ఒమాహాలో సెక్యూరిటీ ఇంజిన్‌గా పనిచేస్తున్నారు. సిస్టమ్‌లో బగ్స్ కనుక్కోవడం ఆయన పని. ఇలా చాలా కంపెనీలలో బగ్స్ కనుక్కొని అనేక సార్లు నగదు బహుమతి కూడా పొందాడు. అయితే అకస్మాత్తుగా గూగుల్ తన అకౌంటులో రెండు కోట్లు జమ చేయడం చూసి షాకయ్యాడు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిరంగపరిచాడు. దీంతో ఖంగుతిన్న గూగుల్ ఎక్కడ పొరపాటు జరిగిందోనని ఆందోళన చెందింది. తర్వాత డబ్బు జమ అయిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. మానవ తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది. ఈ విషయం చెప్పినందుకు శ్యామ్ కర్రీని అభినందిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పనంగా వచ్చిన సొమ్ములో ఒక్క రూపాయి కూడా శ్యామ్ కర్రీ వాడుకోలేదు. పైగా గూగుల్‌కే ఈ విషయాన్ని తెలపడంతో గూగుల్ కూడా ఆ డబ్బుల కోసం ప్రయత్నించలేదు. అతని నిజాయితీని మెచ్చుకొని ఆ డబ్బును అలాగే వదిలేసింది. దీంతో ఇరు పక్షాలను నెటిజన్లు అభినందిస్తున్నారు.