గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ 8.0 - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ 8.0

August 22, 2017

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎప్పటికప్పుడు అప్ డేటింగ్ ఆప్షన్సును తీస్కొస్తూ యూజర్లను కూడా అప్ డేట్ చేస్తోంది. తాజాగా గూగల్ తన నూతన ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ (o)8.0 ను విడుదల చేసింది. న్యూయార్క్ లో ఈ సిస్టమ్ ను లాంఛనంగా విడుదల చేసింది. ఈ కొత్త ఓఎస్ కు ఓరియో (Oreo) అని గూగుల్ పేరు పెట్టింది. దీంతో గతంలో వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్ ల సరసన ఈ సిస్టమ్ కూడా చేరింది. అంతేకాక నిన్న అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్ విడుదల చేసినట్టు తెలిపింది.

ఆండ్రాయిడ్  ఓ (0) 8.0 ఫీచర్లు…

  1. ఆండ్రాయిడ్ 8.0 లో కొత్త నోటిఫికేషన్ చానల్స్ ను ఏర్పాటు చేశారు. దీని వల్ల యూజర్లకు నోటిఫికేషన్లపై మరింత కంట్రోల్ ఉంటుంది. తమకు కావలసిన యాప్ ల నోటిఫికేషన్లు మాత్రమే వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాక  ఒకే యాప్ నుంచి వచ్చే మెసేజ్ లు కొత్త లుక్ లో, ఒకే గ్రూపు లో కనిపిస్తాయి.
  2. డివైస్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు. బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ఎక్కువ బ్యాటరీని వాడుకోకుండా నియత్రించేలా ఏర్పాటు చేశారు. పాత ఓఎస్ ల కన్నా ఆండ్రాయిడ్ 8.0 ఓఎస్ ఉన్న డివైస్ లో బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది.
  3. ఇందులోని ఆటోఫిల్ సదుపాయం సులభంగా ఉంది. యూజర్ తన ఫోన్ నంబర్ , కార్డు, నంబర్లు, చిరునామా, పాస్ వర్డ్ లు ఎంటర్ చేసే సమయంలో.. యస్ ఆర్ నో అనే అని అడుగుతుంది.  ఆటోఫిల్ ను ఎంచుకుంటే సమాచారం సేవ్ అవుతుంది. మనకు కావాలనుకున్నప్పుడు వేరే యాప్ లో, సైట్లలో వాడుకోవచ్చు. ఫాంలో ఆటోఫిల్ సెలెక్ట్ చేస్తే డిటైల్స్ అన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి.
  4. అప్లికేషన్ల ఐకాన్లు విభిన్న స్టైల్స్, డిజైన్లు, షేప్స్ లో ఉన్నాయి. దీంతో డివైస్ యాప్ ఐకాన్స్ కొత్త లుక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. యాప్, లాంచర్, షార్ట్ కట్స్ ఓపెన్ చేసినప్పుడు యానిమేషన్ వచ్చేలా ఓఎస్ ను డిజైన్ చేశారు.

     5.ఆండ్రాయిడ్ 8.0 లో కొత్త పిక్చర్ ఇన్ పిక్చర్ ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోటోలు, వీడియోలు చూస్తూ కూడా కాల్స్ ఆన్సర్ చేస్తూ, చాటింగ్                         చేయొచ్చు.

  1. భిన్నమైన ఫోటో సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఎడిట్ చేసిన వివిధ రకాల ఫోటో ఫార్మాట్ లలో ఉన్న ఇమేజ్ లను కూడా వేగంగా ఓఎస్ చేసుకునేలా ఆండ్రాయిడ్ 8.0ను తీర్చిదిద్దారు.
  2. వైఫై,  బ్లూటూత్ డివైస్ లకు కనెక్ట్ అయినప్పుడు వేగంగా డేటా ట్రాన్స్ ఫర్ అయ్యేలా ఓఎస్ ఉంది. దీని వల్ల డివైస్ లను పెయిరింగ్ చేసుకోవచ్చు.
  3. బ్రౌజర్ ఓపెన్ చేసి సైట్లను చూసినప్పుడు డివైస్ వైరస్ బారిన పడకుండా  గూగుల్ సేఫ్ ఆండ్రాయిడ్ 8.0 లో ఉంది.
  4. పాతవాటి కన్నా యాప్ లు రెండు రెట్లు వేగంగా ఓపెన్ అయ్యేలా 8.0 ను డెవలప్ చేశారు.