Google News : Google Maps launches Immersive View in five cities
mictv telugu

సూపర్ కొత్త ఫీచర్స్ తో గూగుల్ మ్యాప్స్

February 9, 2023

 

Google News : Google Maps launches Immersive View in five cities

తన మ్యాప్స్ లో మరో కొత్త ఫీచర్ సు ప్రవేశపెట్టింది గూగుల్. ఇమ్మెర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్ తో అందరినీ అట్రాక్ట్ చేయాలని గూగుల్ అనుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను పారిస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. మొదట ఐదు ముఖ్య నగరాల్లో దీన్ని తీసుకొస్తున్నామని త్వరలోనే మిగిలిన అన్ని నగరాలకు కూడా ప్రవేశపెడతామని చెప్పింది.

ఇక ఇమ్మెర్సివ్ వ్యూ విషయానికి వస్తే గూగుల్ మ్యాప్ లో మనకు కావల్సిన ప్రదేశాన్ని మరింత స్పష్టంగా చూపించడమే దీని ప్రత్యేకత. మామూలు వ్యూ పీచర్ లానే కనిపించినప్పటికీ ఇందులో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజస్ తో వర్చువల్ వరల్డ్ మోడల్ ను అందించనుంది. అలాగే ట్రాఫిక్, లోకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లలో గ్లాన్సబుల్ డైరెక్షన్స్ అనే కొత్త ఫీచర్ కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతానికి లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూని తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్ లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనివల్ల ఆ నగరాల గురించి ముందే తెలుసుకుని, అక్కడ విజిట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ ఫీచర్ లోని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్ ని కూడా చూడొచ్చని చెప్పింది. ఇది మరింత నేచురల్ గా కనిపించడానికి మామూలు పిక్స్ ని కూడా 3డి ఇమేజ్ లోకి మార్చే కొత్త ఏఐ టెక్నాలజీ అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్ లను ఉపయోగిస్తున్నామని గూగుల్ తెలిపింది.

ఇమ్మెర్సివ్ వ్యూ వల్ల దేన్ని అయితే చూస్తున్నామో వర్చువల్ గా అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందని అంటోంది గూగుల్.అలాగే దానికి దగ్గరలో ఉన్న ఏటీఎం, రెస్టారెంట్, పార్క్, లాంజ్, టాక్స్ స్టాండ్, రెంటల్ కార్స్, ట్రానిట్ స్టేషన్స్ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి దీనితో పాటు మరో ఫీచర్ ను కూడా యాడ్ చేసింది. ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో తయారుచేసిన సెర్చ్ విత్ లైవ్ వ్యూ గురించి కూడా ఒక బ్లాగ్ పోస్ట్ లో గూగుల్ తెలిపింది. దీనిలో లండన్, మాడ్రిడ్, మెల్ బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్ని, తైపీ లాంటి నగరాల్లో వెయ్యి కొత్త ఎయిర్ పోర్ట్ లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ లాంటి వివరాలను రానున్న నెలల్లో అందిస్తామని చెప్పింది.