టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) చాట్‌బాట్ టెక్నాలజీ సంచలనంగా మారింది. మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చి గూగుల్‌కు సవాల్ విసరగా.. అలర్టైన గూగుల్ చాట్‌జీపీటీకి పోటీగా ‘బార్డ్’(Bard)ని పరిచయం చేసింది. దీనిపై ప్రచారాన్ని కూడా నిర్వహించి యూజర్లకు పరిచయం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. అయితే బార్డ్ మొదటిలోనే గూగుల్ కంపెనీ కొంపముంచింది. బార్డ్‌కు సంబంధించిన ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌లో తప్పు జరగడంతో 100 బిలియన్ డాలర్ల షేర్ మార్కెట్ విలువను కోల్పోయింది. గూగుల్ కంపెనీకి సంబంధించిన షేర్లు ఒక్కరోజులోనే 8 శాతం కిందకు పడిపోయాయి
ప్రచారంలో భాగంగా జేమ్స్ వెబ్ స్పేస్ గురించి అడిగిన ప్రశ్నలకు బార్డ్ కొన్ని సమాధానాలు ఇచ్చింది. అయితే వాటిలో ఒకటి తప్పని తేలడం బార్డ్ సామార్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.ఇది గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ షేర్ విలువలపై ప్రభావం చూపింది. బార్డ్ దెబ్బకు దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ విలువను కోల్పోవల్సి వచ్చింది.