గూగుల్‌పేలో మరో ఫీచర్.. ట్రాన్సాక్షన్స్ మరింత సులభం - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌పేలో మరో ఫీచర్.. ట్రాన్సాక్షన్స్ మరింత సులభం

October 30, 2019

డిజిటల్ లావాదేవీలు జరిపే ప్రముఖ యాప్ గూగుల్ పే తమ యూజర్లకు మరింత సెక్యూరిటీని తీసుకువచ్చింది. నగదు లావాదేవీలు జరిపేందుకు కొత్త ఫీచర్ చేర్చారు. అండ్రాయిడ్ 10తో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చింది. దీంట్లో యూజర్లు ఫింగర్ ఫ్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. చాలా సార్లు పిన్ మర్చిపోయినప్పుడు ఇబ్బందులు పడుతుండటంతో పాటు తరుచూ పిన్ ఎంటర్ చేయడం ఎందుకని ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సులభతర పద్దతిని తీసుకువచ్చారు. 

Google Pay ..

ఇప్పుడు ఈ బయోమెట్రిక్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ 10 డివైజుల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో ఆండ్రాయిడ్ 9 ఫోన్లలో కూడా రానుంది. పిన్‌తో పనిలేకుండా చేసుకోవాలంటే యూజర్లు బయోమెట్రిక్‌కు మారిపోవచ్చు. లేకపోతే పాత పద్దతి ద్వారానే కొనసాగించవచ్చు. కాాగా బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే పనిచేస్తుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కచ్చితంగా పిన్ ఎంటర్ చేయాల్సిందేనని చెబుతున్నారు.