Google Pay, Phone Pay as target of cyber fraud
mictv telugu

గూగుల్‌పే, ఫోన్‌పే యూజర్లు జర జాగ్రత్త..

November 12, 2022

పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దోచుకోవడంలో సైబర్ నేరగాళ్లు తమ పంథాలను మారుస్తూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న..ఎంత అవగాహనతో ఉన్న నిరక్ష్యరాస్యుల నుంచి పెద్ద పెద్ద అధికారుల వరకు అందరినీ మోసం చేస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో అంచనాలకు అందకుండా..అనుమానం రాకుండా వందలాది మార్గాల ద్వారా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసానికి శ్రీకారం చుట్టారు.

గూగూల్, ఫోన్‌ఫే వాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ కొత్త మోసాలకు తెరలేపారు. ఈ సారి కొంచెం తెలివిగా ప్లాన్ సిద్ధం చేసారు. మొదట మన యూపీఐ అకౌంట్లకి..కొంత డబ్బును పంపుతున్నారు. తర్వాత కాల్ చేసి పొరపాటున మీ అకౌంట్‌లో నగదు వేశామని రిటర్న్ చేయమని కోరుతున్నారు. ఇలా రిటర్న్ చేసిన వెంటనే మన అకౌంట్‌‌ని హ్యాక్ చేసి డబ్బును మాయం చేస్తున్నారు. తెలియని వ్యక్తులు అకౌంట్‌లో డబ్బులు వేసి తిరిగి పంపమంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.