Home > Featured > గూగుల్ నుంచి కెమెరా వాచ్

గూగుల్ నుంచి కెమెరా వాచ్

Google Pixel Watch.

ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ అంతా స్మార్ట్ మాయం. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజం గూగుల్ మరో అడుగు ముందుకు వేసి స్మార్ట్ కెమెరా వాచ్ ను రూపొందిస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా గూగుల్ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. గతేడాది ఆ వాచ్​ గురించి ప్రకటించాలనుకున్నా కుదర్లేదు. కానీ, ఈసారి మాత్రం ఆ కెమెరా వాచ్​ పై పక్కాగా ప్రకటన వస్తుందని సమాచారం. తాజాగా ఆ వాచ్​ కోసం గూగుల్ కంపెనీ అమెరికాలో పేటెంట్​ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. జులై 2017లోనే దరఖాస్తు చేసుకున్నా ఈ నెల 27న ఆ పేటెంట్​ అప్లికేషన్​ను జనానికి అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది.

జస్ట్​ ‘కెమెరా వాచ్​’ అన్న పేరుతోనే ఓ ఏడు డయాగ్రమ్​లను అందులో చూపించింది. అయితే, అసలు డిజైన్​ను మాత్రం వెల్లడించలేదు. మరి, ఆ వాచ్​కు పేటెంట్ వచ్చిందా.. రాలేదా అనే అంశమై స్పష్టత రావాల్సిఉంది. చిన్నచిన్న కంపెనీల స్మార్ట్​వాచ్​లలో కెమెరాలు ఉన్నప్పటికీ శాంసంగ్​, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీల స్మార్ట్​వాచ్​లలో కెమెరాలు లేవు. దీంతో కెమెరాతో స్మార్ట్​ వాచ్​ తెస్తున్న మొదటి పెద్ద కంపెనీ గూగుల్​ అయింది. గూగుల్​ పిక్సెల్​ 3, పిక్సెల్​ 3 ఎక్స్​ఎల్​లో వాడిన కెమెరాను ఈ స్మార్ట్​వాచ్​లో వాడుతున్నట్టు సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, వీడియో కాల్​ చేసుకోవడం వంటి వాటికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Updated : 30 Aug 2019 12:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top