Google released notification for Apprentice posts
mictv telugu

గూగుల్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు

October 24, 2022

Google released notification for Apprentice posts

ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ పలు విభాగాల్లో అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు బెంగళూరు, హైదరాబాద్, ముంబయ్, గుర్‌గావ్‌లలో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు చివరితేదీగా అక్టోబర్ 27ని నిర్ణయించింది. అప్రెంటీస్ కాలం 12 నుంచి 24 నెలలు ఉండగా ప్రోగ్రామ్ 2023 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 4 విభాగాల్లో గూగుల్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. అవేంటంటే..
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటీస్ : దీనికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. డిజిటల్ మార్కెటింగ్‌లో గరిష్టంగా ఏడాది పని అనుభవం ఉండాలి. అంతేకాక, కంప్యూటర్ పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి.

2. ఐటీ అప్రెంటీస్ : ఇంజినీరింగ్ లేదా టెక్నికల్ డిగ్రీ అర్హతగా ఉంది. ఐటీ లేదా సంబంధిత సాంకేతిక విభాగంలో కనీసం ఆరు నెలలతో పాటు కస్టమర్ సర్వీస్ రంగంలో అనుభవం ఉండాలి.

3. డేటా అనలిటిక్స్ అప్రెంటీస్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఈ రంగంలో గరిష్టంగా ఏడాది అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

4. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటీస్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, ప్రాజెక్ట్ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి.
మరిన్ని వివరాల కోసం shorturl.at/bDEMT ని క్లిక్ చేయండి.