విడుదలైన దగ్గరి నుంచి నాటు నాటు పాట తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. రీసెంట్గా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం దక్కించుకున్న నాటు నాటు పాట తాజాగా మరో రికార్డుతో వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను కంటిన్యూ చేస్తోంది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తరువాత గూగుల్ లో ఈ పాట కోసం నెటిజన్లు తెగ వెతికారని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీంతో మరోసారి నాటు నాటు పాట సోసల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా వైభవాన్ని వెలుగెత్తి చాటింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాలోని పాట నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. తరువాత కూడా ఈ పాట ఊపు ఏమాత్రం తగ్గలేదు సరికదా అమాంతం దాని క్రేజ్ పెరిగిపోయిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా నాటు నాటు పాట మానియాలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా నాటు నాటు పాటే వినిపిస్తోంది. ఆస్కార్ ప్రకటించిన తరువాత పాటను 10 రెట్లు అధికంగా గూగుల్ లో సెర్చ్ చేసినట్లు జపాన్‌కు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. 1,150 శాతం సెర్చింగ్‌తో ఈ పాటు రికార్డును క్రియేట్ చేస్తోంది. టిక్ టాక్‌లోనూ ఈ పాటు ట్రెండ్ సెట్టర్‌గానే నిలిచింది. ఏకంగా 52.6 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ పాట యూట్యూబ్‌లో విడుదలై చాలా రోజులే అయినప్పటికీ టాప్ ప్లేస్‌లో నిలిచి నెట్టింట్లో సునామీని సృష్టిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఓ రేంజ్లో దుమ్ముదులిపేశారు. వీరిద్దరి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ వల్లే ఈ పాటకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ సెలబ్రిటీలందరూ ఈ పాటకు తమ కాలును కదిపారు. అందుకే హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ అందరినీ పక్కకు నెట్టి నాటు నాటు అస్కార్ ను సొంతం చేసుకుంది.