కరోనా వైరస్ కోసం గూగుల్ ప్రత్యేక వెబ్‌సైట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ కోసం గూగుల్ ప్రత్యేక వెబ్‌సైట్‌

March 22, 2020

vbnm,

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 2 లక్షల మందికి సోకింది. ఈ వైరస్ బారిన పడి దాదాపు 11 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌పై అవగాహనా కల్పించడానికి దిగ్గజ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఈ వైరస్ బారిని పడకుండా, కాపాడుకునే రక్షణ చర్యలు తదితర సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఓ కొత్త వెబ్‌సైట్‌ను శనివారం లాంచ్‌ చేసింది. కరోనా వైరస్ కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్‌సైట్‌ను తీసుకురావాలని, తద్వారా ఇది ప్రజలను పరీక్షా సైట్‌లకు నిర్దేశించాలని ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ‘గూగుల్.కామ్/కోవిడ్19 అనే వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ వైరస్‌పై అవగాహన, నివారణ, స్థానిక వనరులపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం అమెరికాలో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ రానున్న రోజుల్లో ఇతర దేశాలు, మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని లాంచ్‌ సందర్భంగా గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.