గూగుల్ వాచీలు పేలుతున్నాయి... కంపెనీ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ వాచీలు పేలుతున్నాయి… కంపెనీ కీలక నిర్ణయం

March 3, 2022

14

ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ కు అమెరికా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఆ కంపెనీ మార్కెట్ లో అమ్మిన స్మార్ట్ వాచీలను రీకాల్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకెళితే.. గూగుల్ కి చెందిన ఫిట్ బిట్ అనే కంపెనీ మార్కెట్ లో విడుదల చేసిన ఐకానిక్ స్మార్ట్‌ వాచ్‌లు నాణ్యత లేమి కారణంగా వినియోగదారులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాచీలను ధరించిన తర్వాత అందులో ఉండే బ్యాటరీ పేలడం, చేతులకు తీవ్ర గాయాలవడంతో కస్టమర్లు కంపెనీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదులపై విచారణ చేపట్టిన కమిషన్ సభ్యులు.. ఫిట్ బిట్ కంపెనీ మార్కెట్ లో అమ్మిన పది మిలియన్ వాచీలను రీకాల్ చేయాలని ఆదేశించింది. దాంతో వేరే దారి లేక వాటిని రీకాల్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది.