Google's decision to lay off 10 thousand employees
mictv telugu

10 వేల మందిని తొలగించేందుకు గూగుల్ నిర్ణయం!

November 22, 2022

ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. మాంద్యం భయాల నేపథ్యంలో ఆదాయం తగ్గుతుందనే అంచనాకు వచ్చిన దిగ్గజ టెక్ కంపెనీలు వ్యయం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ముందుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఇప్పటికే ఫేస్ బుక్, అమెజాన్, ట్విట్టర్ కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు గూగుల్ వంతు వచ్చింది. పనితీరు సరిగ్గా లేని వారిని దశలవారీగా తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో కంపెనీ మేనేజర్లు ఆ పనిలో ఉన్నట్టు సమాచారం. ఇక ఆదాయం పరంగా చూస్తే క్రితం ఏడాది చివరి త్రైమాసికానికి ఈ ఏడాది చివరి త్రైమాసికానికి మధ్య లాభంలో చాలా తేడా ఉంది. నికరంగా చూస్తే కంపెనీ లాభాలు 27 శాతం పడిపోయింది. ఫలితంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఐటీ రంగంలో గూగుల్ కంపెనీ అందరికంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తుంది. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,87,000 మంది ఉద్యోగులు ఉండగా, వారి వార్షిక ఆదాయం రూ. 2.41 కోట్లుగా ఉంది.