పోలీసును చితగ్గొట్టిన జూదగాళ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసును చితగ్గొట్టిన జూదగాళ్లు..

March 19, 2018

కథ అడ్డం తిరిగింది. రౌడీలను, నేరస్తులను పోలీసులు చితకబాదడం మామూలే. బెంగళూరులో మాత్రం ఓ పోలీసును జూదగాళ్లు నడిరోడ్డుపై చితగ్గొట్టేశారు. వైట్ ఫీల్డ్ ప్రాంతంలో జూదం ఆడుతున్నారని సమాచారం అందడంతో ఒక పోలీసు అక్కడికి వెళ్లాడు. జూదం తప్పు అని హల్‌చల్ చేశాడు. ముందూ వెనకా చూసుకోలేదు. అయితే అతడు ఒక్కడు, అవతలివాళ్లు పదుల సంఖ్యలో ఉండడంతో వారిపై పైచేయి అయింది. పోలీసులు జూదగాళ్లు, స్థానిక గూండాలు పట్టుకుని తీవ్రంగా దాడి చేశారు. పారిపోతున్నా వెంటపడి మరీ కొట్టారు. చివరికి అతడు ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.