గాంధీ మనవడు కూడా తూచ్.. దిక్కతోచని విపక్షాలు
విపక్షాల ఆశాకిరణం కూడా నో చెప్పింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి జాతిపిత మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కాస్త వెనకడుగు వేశారు. తాను పోటీలో నిలబడనని స్పష్టం చేశారు. శరద్ పవార్(ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా(నేషనలిస్ట్ కాంగ్రెస్)లు తాము పోటీ చేయబోమని విపక్షాకు చెప్పిడం తెలిసిందే. దీంతో గోపాలకృష్ణకు నచ్చజెప్పి ఆయన్ను బరికిలోకి దింపడానికి విపక్షాలు యత్నించాయి. అయితే తనకు ఆసక్తి లేదని, మరొకర్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.
‘ఉన్నత పదవికి నా పేరును పరిశీలించినందుకు ధన్యవాదాలు. విపక్షాల అభ్యర్థి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చేలా ఉండాలి. ఆ పనిని నాకంటే బాగా చేయగలిగిన వారు చాలా మంది ఉన్నారు. పార్టీల ఐక్యతకు కృషి చేసే వ్యక్తిని అభ్యర్థిగా ఎంచుకోవాలి. చివరి గవర్నర్ జనరల్ రాజాజీ, తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి వాళ్లు కొత్త రాష్ట్రపతి కావాలని ఆశిస్తున్నా’’ అని గాంధీ పేర్కొన్నారు.