Home > Featured > ఇస్తాంబుల్‌లో బాలయ్య సినిమా షూటింగ్.. సెల్ఫీ తీసిన గోపిచంద్

ఇస్తాంబుల్‌లో బాలయ్య సినిమా షూటింగ్.. సెల్ఫీ తీసిన గోపిచంద్

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ 107వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాల పెరుగుతున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం యూనిట్ అంతా టర్కీలోని ఇస్తాంబుల్‌లో గడుపుతున్నారు.

కాగా బాలయ్య సినీ ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా NBK 107 మూవీ సెట్ నుంచి గోపిచంద్ మ‌లినేని ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్‌తో కలిసి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య లుక్ చూసి అభిమానులు తెగసంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్ట్‌గా.. మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ లు నిర్మాతలు.

Updated : 30 Aug 2022 10:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top