గోపీచంద్ ‘ఆక్సిజన్’ - MicTv.in - Telugu News
mictv telugu

గోపీచంద్ ‘ఆక్సిజన్’

August 29, 2017

గోపీచంద్ కథానాయకుడిగా ఏ .ఎం.  జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘ఆక్సిజన్’. ఈ సినిమాను శ్రీసాయిరామ్  క్రియేషన్ పతాకంపై ఎస్ ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టు ప్రోడక్షన్ పనులు  పూర్తయ్యాయి. ఎస్ ఐశ్వర్య మాట్లాడుతూ “ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్  గా రూపొందిన మూవీ ఇది. ఇది గోపీచంద్ కెరీర్లో బిగెస్ట్ బడ్జెట్ మూవీ. ఇందులో గోపీచంద్ చాలా హ్యండసమ్ గా కనిస్తారు. ముంబై, గోవా, చెన్నై ప్రాంతాల్లో షూటింగ్  జరిపాం. జ్యోతికృష్ణ టేకింగ్ విలువలు సినిమా విడుదలాయ్యాక ప్రేక్షకులకు అర్ధమైతాయి. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా రాశీ ఖన్నా,అను ఇమ్మాన్యుయేల్  నటిస్తున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. త్వరలోనే పాటలను విడుదల చేసి, అక్టోబర్ 12న సినిమాను విడుదల చేస్తాం‘‘ అని చెప్పారు.

జగపతి బాబు, కిక్ శ్యామ్, ఆలీ, చంద్రమోహన్, నాగీనీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, సితార తదితరులు ఇందులో నటిస్తున్నారు.  ఈ సినిమాకు కెమెరా వెంట్రి చోటా కె నాయుడు, పాటలు శ్రీమణి, రామజోగయ్య శాస్త్రి .