గోరఖ్ పూర్ డెత్ స్పాట్ అని ఒప్పుకుంటారా! - MicTv.in - Telugu News
mictv telugu

గోరఖ్ పూర్ డెత్ స్పాట్ అని ఒప్పుకుంటారా!

August 19, 2017

ఆక్సిజన్ అందక చనిపోయిన 70 మంది పిల్లలపై సహజంగానే శవరాజకీయాలు చేస్తారు మన రాజకీయ నేతలు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఏదీ తక్కువ తినలేదు.

చిన్నారులను బలిగొన్న గోరఖ్ పూర్ ఆస్పత్రిని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సందర్శిస్తున్నారు. బాధితులను ఓదార్చడానికి ఆయన వచ్చాడట. సరే ఇదేం పెద్ద విషయం కాదని సీఎం యోగి ఆదిత్యనాథ్ సరిపెట్టుకోవచ్చు. కానీ అలా సరిపెట్టుకుంటే రాజకీయ దాడి ఎలాగా? అందుకే రాహుల్ పై దాడికి దిగారు.

‘ఢిల్లీలో ఒక యువరాజు ఉన్నాడు. ఆయనకు స్వచ్ఛ భారత్ గురించి ఏమీ తెలియదు. గోరఖ్ పూర్ పిక్నిక్ స్పాట్ కాదు.. ఆయను అక్కడికి ఎందుకు అనుమతించాలో సరైన కారణం కనిపించడం లేదు’ అని విమర్శించారు.

ఇందులో చిత్రమేమంటే ఇప్పటికే గోరఖ్ పూర్ ఆస్పత్రిని సందర్శించిన యోగి.. పిల్లల ప్రాణం తీసిన పాపాన్ని కడుక్కోవానికి అన్నట్లు ఊరిలో స్వచ్ఛ భారత్ పేరుతో నానా హంగామా చేస్తున్నారు. ఆయన గోరఖ్ పూర్ కు వచ్చినప్పుడు రాహుల్ కూడా వస్తే ఆయనకున్న అభ్యంతరమేంటో మరి.

గోరఖ్ పూర్ పిక్నిట్ స్పాట్ కాదన్న యోగి.. పసికూనల ప్రాణాలు తీసిన ఆ ఊరిని డెత్ స్పాట్ అంటే ఒప్పకుంటారా?