యోగి ఆదిత్య నాద్ పై మండిపడ్డ నోబెల్ శాంతి గ్రహీత... - MicTv.in - Telugu News
mictv telugu

యోగి ఆదిత్య నాద్ పై మండిపడ్డ నోబెల్ శాంతి గ్రహీత…

August 12, 2017

బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి గ్రహీత కైలాశ్ సత్యార్థి గోరఖ్ పూర్ బీఆర్ డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం పై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. యూపి ప్రభుత్వం పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు చనిపోయారు. ఇది విషాదం కాదని, నర మేధం అని 70 ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా అని కైలాశ్ ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్య నాద్ ఈ ఘటనలో మీరు తీసుకునే నిర్ణయం దశాబ్దాలుగా అవినీతిమయమైన వైద్యవ్యవస్థను సరిచేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అని సత్యార్థి ట్వీట్ చేశారు.

గత రెండు రోజుల్లో గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ ఆసుప్రతిలో ఆక్సిజన్ సరఫరా అందక 30 మంది పిల్లలు చనిపోయారు.. శనివారం ఉదయం మరో ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన పై విపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. సీఎం ఆదిత్య నాథ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.