గో సంరక్షణ గ్రూపుల్ని నిషేధించాల్సిందే..! - MicTv.in - Telugu News
mictv telugu

గో సంరక్షణ గ్రూపుల్ని నిషేధించాల్సిందే..!

July 21, 2017

గో సంరక్షణ పేరిట మనుషులపై దాడుల చేస్తే సహించేది లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇలాంటి దాడుల్ని ఏలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేసింది. గోసంరక్షణ పేరిట ఉన్న గ్రూపులపై నిషేధం విధించాలంటూ వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. గోసంరక్షణ పేరుతో తరచూ వెలుగుచూస్తున్న దాడులపై సుప్రీంకు కేంద్రం నివేదిక సమర్పించింది. గోసంరక్షణ పేరుతో దాడులు చేసే వారికి ఈ దేశంలో స్థానం లేదని తెలిపింది. గోసంరక్షణ దాడులపై నివేదిక సమర్పించాల్సిందిగా గతంలో రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. సామాజిక మాధ్యమాల్లో గోసంరక్షణ పేరిట ఉన్న గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని తొలగిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోర్టు రాష్ట్రాలను, కేంద్రాన్ని కోరింది. గోసంరక్షణ పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు చెప్పాయి.