Gorantla Madhav video is a turning point in the case
mictv telugu

గోరంట్ల మాధవ్ వీడియో కేసులో కీలక మలుపు

September 15, 2022

Gorantla Madhav video is a turning point in the case

రాష్ట్రపతి కార్యాలయం వరకూ వెళ్లిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం.. చివరకు సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి చ‌ర్య‌లను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆర్డ‌ర్ జారీ చేసింది. త‌న‌దిగా చెబుతూ ఓ మార్ఫింగ్ వీడియోతో త‌న ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నారంటూ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌లువురు టీడీపీ నేత‌ల పేర్ల‌ను సీఐడీ అధికారులు చేర్చారు.

ఎంపీ మాధవ్‌ ఫిర్యాదుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ పైనా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విజయ్ హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు జారీ చేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో త‌న‌ను నిందితుడిగా చేర్చిన వైనాన్ని విజ‌య్ హైకోర్టులో స‌వాల్ చేశారు. విజ‌య్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను నిలిపివేయాలంటూ సీఐడీ అధికారుల‌ను ఆదేశిస్తూ స్టే ఆర్డ‌ర్‌ను జారీ చేసింది.