ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ఊహించినట్లే ఎమ్మెల్సీ పోస్ట్ దక్కింది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను శాసనమండలి సభ్యత్వానికి సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల కోసం వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపింది. గోరటి వెంకన్నతోపాటు కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఇదివరకు వార్తలు వచ్చాయి. దేశపతికి బదులు దయానంద్‌కు పోస్ట్ దక్కింది.
నాయిని నర్సింహారెడ్డి మృతి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ల పదవీ కాలం ముగియడంతో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీ అయ్యాయి. రేసులో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించాయి. కులసమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గోరటి వెంకన్న కళాకారుడిగా పేరుప్రతిష్టలు ఉన్నవారు కావగంతో ఆయన ఎంపిక సులభంగా జరిగిపోయింది. బస్వరాజు టీడీపీ నుంచి వచ్చినా ఏడేళ్లుగా టీఆర్ఎస్కు నమ్మినబంటుగా ఉండడం సానుకూల అంశంగా మారిది