ఈ గొరిల్లా ‘మహానుభావుడు’కి తమ్ముడు! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ గొరిల్లా ‘మహానుభావుడు’కి తమ్ముడు!

March 19, 2018

ఇటీవల వచ్చిన ‘మహానుభావుడు’ సినిమాలో హీరో శర్వానంద్‌కు అతి శుభ్రత జబ్బు ఉంటుంది. కడిగిందే కడుక్కోవడం, తుడుచుకుందే తుడుచుకోవడం..!  ఈ జబ్బు మానవులకే కాదు, వారి మూలపురుషులకూ ఉన్నట్లుంది. అందేనండి వానరాలకు. అమెరికాలోని ఫిలడెల్ఫియా జూలో లూయీ అనే మగ గొరిల్లా ఉంది. దీనికి కూడా ‘మహానుభావుడి’లాగే అతిశుభ్రత జబ్బుంది. దీంతో దానికి మనిషి బుద్ధులతోపాటు మనిషి నడక కూడా వచ్చేసింది.

18 ఏళ్ల వయసున్న లూయీకి తన చుట్టూ బురద ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. పళ్లు, బిస్కెట్లంటే భలే ఇష్టం.  సందర్శకులు వాటిని తనపైకి విసిరితే అద్భుతంగా క్యాచ్ పట్టేస్తుంది. పట్టిన వాటిని మిగతా గొరిల్లాగా వంగి కాళ్లపై, చేతులపైనా నడుచుకుంటూ తన స్థావరంలోకి తీసుకెళ్తే మట్టి అంటుకుంటుంది. అందుకే లూయీ ఏమాత్రం వంగకుండా.. అచ్చం మనిషిలా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ శుభ్రత అలవాటు వల్ల లూయీకి మనిషిలా నడవడం అలవాటైపోయింది. నిజానికి గొరిల్లాలు అప్పుడప్పుడూ కాళ్లతో నడుస్తుంటాయని, అయితే లూయీకి ఇదొక అలవాటుగా మారపోయిందని జూ సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల అది తిప్పుకుంటూ తిప్పుకుంటూ నడుస్తున్న వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్  చేయడంతో ఈ ‘మహానుభావుడి’ కథ అందరికీ తెలిసిపోయింది.