Gosha mahal Rajasingh pd act advisory board decision
mictv telugu

రాజాసింగ్‌కు షాక్.. పీడీ యాక్ట్ ఎత్తేయడానికి బోర్డు నో

October 26, 2022

Gosha mahal Rajasingh pd act advisory board decision

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో మగ్గుతున్న ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చుక్కెదురైంది. ఆయనపై నమోదైన పీడీ యాక్ట్ కేసును అడ్వైజరీ కమిటీ సమర్థించింది. కేసును ఎత్తేయాలన్న రాజాసింగ్ వినతిని, అన్ని అంశాలు పరిశీలించి తోసిపుచ్చింది.

దీంతో ఆయన మరికొన్ని నెలలు జైల్లోనే ఉండే అవకాశముంది. కేసును ఎత్తేయాలని ఆయన భార్య ఉషాబాయి సమర్పించిన దరఖాస్తును బోర్డు చైర్మన్ భాస్కర్ రావు, మరో ఇద్దరు జడ్జీలు విచారించారు. రాజాసింగ్‌పై తీసుకున్న చర్యను పోలీసులు సమర్థించుకుంటూ, ఆయనపై వంద కేసులు ఉన్నాయని వివరించారు. మొత్తం 101 కేసులు ఉండగా వాటిలో 18 కేసులు మతం గొడవలకు సంబధించినవేనన్నారు. కాగా ఇటీవల బోర్డు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్ తనపై ఉన్న కేసులన్నీ కొట్టేశారని చెప్పారు. బోర్డు నిర్ణయంతో ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాజాసింగ్ రెండు నెలల కింద ఓ వీడియో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారని ముస్లింలు నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపారు. బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.