Goshamahal BJP MLA Rajasinghe to Director Ram Gopal Varma
mictv telugu

‘ఆర్జీవీ ఓ వేస్ట్ ఫెలో’.. ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

June 24, 2022

Goshamahal BJP MLA Rajasinghe to  Director Ram Gopal Varma

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన అనుచిత ట్వీట్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్ధిని కించపరిచిన అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్మ ఎప్పుడూ పబ్లిసిటీ కోసం పాకులాడుతూ వుంటాడని.. అతడొక వేస్ట్ ఫెలో అని, అందుకే ద్రౌపది ముర్ముపై కామెంట్ చేశారని రాజాసింగ్ ఫైరయ్యారు. ఎస్టీ మహిళగా పేద కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతిగా అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు రాజాసింగ్.

కాగా.. గురువారం రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో..‘‘ ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ?” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. దీనిపై గిరిజనులు భగ్గుమన్నారు. రామ్ గోపాల్ వర్మ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.