ఖబడ్డార్ పవన్.. రాజాసింగ్ వార్నింగ్. - MicTv.in - Telugu News
mictv telugu

ఖబడ్డార్ పవన్.. రాజాసింగ్ వార్నింగ్.

December 3, 2019

raja singh01

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూమతంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాటిని  తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు. హిందూమతంపై కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘పవన్‌‌ది ఏ మతం? అతడు మతం మార్చుకున్నాడా?’ అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని అన్నారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పవన్ నిన్న తిరుపతిలో మాట్లాడుతూ..మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనని వ్యాఖ్యానించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని.. సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను రాజాసింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.