ఏపీ చరిత్రలో కొత్తకోణం.. గొట్టిప్రోలులో ప్రాచీన వ్యాపార కేంద్రం  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ చరిత్రలో కొత్తకోణం.. గొట్టిప్రోలులో ప్రాచీన వ్యాపార కేంద్రం 

October 27, 2019

Gottiproulu commercial center 

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదొక వైభవోజ్వల ఘట్టం. కాలగర్భంలో కలసిపోయిన 2వేల ఏళ్ల నాటి వ్యాపార స్థావరం చరిత్ర తాజాగా వెలుగు చూసింది. అపూరూపమైన చారిత్రక సంపదను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీస్తున్నారు. నెల్లూరు జిలా నాయుడుపేట మండంలోని గొట్టిప్రోలులో ఏఎస్ఐ శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో అమూల్య చారిత్రక సంపద బయటపడుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపారంగా కేంద్రంగా వర్ధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎన్నో రాజవంశాలు పాలించిన ఆధారాలు లభిస్తున్నాయి. 

rr

పల్లవ రాజైన మహేంద్రవర్మ దీన్ని నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారణకు వస్తున్నారు. డిసెంబర్ నుంచి  40 ఎకరాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. పురాత కోట నిర్మాణాలు, పెంకుటిళ్లు వెలుగు చూశాయి. 30 అడుగుల లోతైన బావి కూడా బయట పడింది. నిలువెత్తు శ్రీమహావిష్టువు కటిహస్త విగ్రహం, నీటి తొట్టి, మురుగునీటి కాలువలు కనిపించాయి. నాటి ప్రజలు వాడిన కుండలు, పూసల, ఇతర పరికరాలు కనిపించాయి. రోమన్లు వాడిన పాత్రలు కూడా బయటపడ్డంతో గొట్టిప్రోలు ఆనాడు అంతర్జాతీయ వ్యాపారకేంద్రంగా విలసిల్లినట్లు తేలింది. గొట్టిప్రోలులో దొరికిన ఇటుకల సైజు 43×48 సెంటీమీటర్లు అని, క్రీస్తు శకం 1, 2వ శతాబ్దాల్లో అమరావతి, నాగార్జున కొండల్లో వాడిని ఇటుకల సైజు కూడా అంతే కావడంతో ఈ స్థావరం 2 వేల ఏళ్ల నుంచి ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.