తార్పుడు మహిళ అరెస్ట్.. సంబంధం లేదన్న గవర్నర్

ఎక్కువ మార్కులు, డిగ్రీల కోసం అమ్మాయిలను వర్సిటీ అధికారులకు తార్చారన్న ఆరోపణలపై అరెస్టయిన మదురై కామరాజ్ యూనివర్సిటీకి చెందిన దేవాంగ ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకురాలు నిర్మలాదేవి అరెస్ట్‌పై తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, అదృష్టవశాత్తూ తాను ముత్తాత వయసులో ఉన్నానని అన్నారు.  చాన్సలర్ కూడా అయిన గవర్నర్ తనకు బాగా తెలుసని నిర్మల ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిచారు.

‘ఆ ఆడమనిషి ఎవరో నాకు తెలియనే లేదు. ఈ కేసులో దోషిగా తేలిన వారిపై చర్య తీసుకుంటాం. దర్యాప్తు తర్వాత పూర్తివివరాలు చెబుతాం’ అని ఆయన మంగళవారం తెలిపారు. ఒక దక్షిణాది రాష్ట్ర గవర్నర్.. రాజ్ భవన్‌లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎవరన్నదీ ఇప్పటికీ తెలియడం లేదు.