సరూర్‌నగర్ హత్యపై స్పందించిన గవర్నర్.. ప్రభుత్వానికి ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

సరూర్‌నగర్ హత్యపై స్పందించిన గవర్నర్.. ప్రభుత్వానికి ఆదేశం

May 6, 2022

సరూర్ నగర్‌లో జరిగిన దళిత యువకుడు నాగరాజు దారుణ హత్యపై గవర్నర్ తమిళిసై స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మతాంతర పెళ్లి చేసుకున్నందుకు హత్య జరిగింది కాబట్టి వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్నిఆదేశించారు. కాగా, మతాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఆశ్రిన్ అలియాస్ పల్లవి భర్త నాగరాజును ఆమె సోదరులు రోడ్డుపై కొట్టి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో తామే హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని ఎల్బీనగర్ డీసీపీ వెల్లడించారు. ఇదిలా ఉండగా, నాగరాజును పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత తన సోదరుడు తనను రెండు సార్లు ఉరి వేయడానికి ప్రయత్నించాడని పల్లవి వెల్లడించింది. తన అమ్మ కూడా చంపేస్తామని బెదిరించిందని మీడియాకు తెలిపింది.