ఏపీ : ప్రజలకు బిగ్ రిలీఫ్.. కరెంటు కోతలు పూర్తిగా ఎత్తివేత - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : ప్రజలకు బిగ్ రిలీఫ్.. కరెంటు కోతలు పూర్తిగా ఎత్తివేత

May 18, 2022

ఎండాకాలంలో కరెంటు కోతలతో ఇంతవరకు సతమతమైన ప్రజలకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రాష్ట్రంలో కరెంటు కోతలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలకు కూడా ఎలాంటి పవర్ కట్లు ఉండవని స్పష్టం చేసింది. కాగా, బొగ్గు సమస్యతో ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు ఒకరోజు పవర్ హాలిడేను ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత దానిని ఎత్తివేసింది. ఇకపై అన్ని రంగాలకూ పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా చేయనున్నట్టు తెలిపింది. కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలకు కొంత నీరు రావడంతో పాటు ఆయా రాష్ట్రాల జలాశయాలలో కూడా వరద నీరు రావడంతో జల విద్యత్ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.