రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. అంతకు ముందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు అయిన తర్వాత సెలవులు ఇవ్వాలని భావించినా, ఎండ రోజు రోజుకూ పెరుగుతుండడంతో ముందే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. ఏప్రిల్ 7 నుంచి 1 – 9 తరగతుల పరీక్షలు జరగనున్నాయి. ఫలితాలను 23లోగా ప్రకటించి, మరుసటి రోజు నుంచి వేసవి సెలవులు మంజూరు చేయనున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక్క పూట బడులను ఈ రోజు నుంచి ఉదయం 11.30 వరకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.