ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా

October 12, 2020

Government announces Rs 10,000 interest-free festival advance

పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వడ్డీ లేకుండా పదివేల రూపాయల వరకు అడ్వాన్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది మార్చి 31, 2021 నాటికి ముగియనుంది. ఈ ప్రయోజనాన్ని ప్రీ-పెయిడ్ రూపే కార్డుగా అందించనున్నారు. ఫెస్టివెల్ బోనస్‌ను ఒకేసారి ఇవ్వనున్నారు.

అలాగే లీవ్ ట్రావెల్ కన్సీషన్(ఎల్టీసీ) రూపంలో వోచర్లను ఇవ్వనున్నారని తెలిపారు. ఈ ఓచర్లను ఎక్కడైనా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వినియోగించేలా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వీటిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఈ వోచర్లను 2021 మార్చి 31 వరకు ఉద్యోగులు వినియోగించుకోవచ్చు. ఈ ఎల్టీసీ వోచర్లతో కేవలం ఆహారేతర వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. అవి కూడా 12 శాతం, లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ అమలయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. వీటిని జీఎస్టీ నమోదిత ఔట్‌లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.