ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ ఆయనే! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ ఆయనే!

January 14, 2020

RBI.

ప్రముఖ ఆర్థికవేత్త మైఖేల్ పాత్రా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా నియమితులు అయ్యారు. గతంలో డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విరాల్ ఆచార్య స్థానంలో.. నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా పాత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు సంవత్సరాలు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.59 ఏళ్ల మైఖేల్‌ పాత్రా ప్రస్తుతం ఆర్బీఐ పరిశోధన విభాగంలో ద్రవ్య విధాన కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

ఆర్బీఐ వర్గాల సమాచారం మేరకు డిప్యూటీ గవర్నర్‌గా ఆయనకు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఆయనకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. 2019లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ నేతృత్వలో వడ్దీ రేట్లను తగ్గించడంలో మైఖేల్ పాత్రా కీలక పాత్ర పోషించారు. ఐఐటీ నుంచి ఆర్థిక శాస్తంలో డాక్టరేట్ పొందారాయన.