పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చినోళ్లకు రూ.5.5 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చినోళ్లకు రూ.5.5 లక్షలు

October 9, 2019

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంత కాలం నివసించి మళ్ళీ జమ్మూకశ్మీర్‌కు వచ్చి స్థిరపడిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున మొత్తం 5,300 కుటుంబాలకు ఈ ప్యాకేజి అందనుంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Pak occupied kashmir.

2016లో నాటి మంత్రివర్గం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, ఛాంబ్‌ నుంచి భారత్‌కు వచ్చిన కుటుంబాలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్యాకేజీని ప్రకటించింది. అయితే అప్పుడు అనేక కుటుంబాలకు జాబితాలో చోటు దక్కలేదు. దీంతో వారి కోసం కేంద్రప్రభుత్వం తాజాగా ప్యాకేజీని ప్రకటించారు. 2016లో ప్రకటించిన జాబితాలో జమ్మూకశ్మీర్‌లో స్థిరపడిన కుటుంబాలకు ప్రకటించిన ప్యాకేజీలో 36,384 కుటుంబాలకు మాత్రమే చోటు దక్కింది. ఆ జాబితాలో చోటు చేసుకోని 5,300 కుటుంబాలకు తాజాగా ప్యాకేజీని ప్రకటించారు. యుద్ధాలు, ఘర్షణలు కారణంగా ఆర్థిక చితికిపోయిన ఈ కుటుంబాలకు నెలవారీ కొంతైన ఆదాయం దక్కాలన్న లక్ష్యంతో వీరికి ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది.