రేపు బ్యాంకులు బంద్... - MicTv.in - Telugu News
mictv telugu

రేపు బ్యాంకులు బంద్…

August 21, 2017

మంగళవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాటపట్టనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, నష్టాల్లో ఉన్న బ్యాంకుల మూసివేత, మొండి బకాయిల రద్దుకు వ్యతిరేకంగా విధులకు గైర్హాజరు కానున్నారు.

ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టేవారిపై క్రిమినల్ కేసు పెట్టాలని, బకాయిల రికవరీకి పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కార్పొరేట్‌ రుణాల ఎగవేత వల్ల వచ్చిన నష్టాన్ని సామాన్య ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల ద్వారా  భర్తీ చేసుకోకూడదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం సూచించారు. బ్యాంక్స్‌ బోర్డ్ బ్యూరోను ప్రభుత్వం రద్దు చేయాలని, మొండిబకాయిల వసూలుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, మంగళవారం ప్రైవేటు బ్యాంకులు యథావిధిగానే పనిచేయనున్నాదయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె కారణంగా చెక్‌ క్లియరెన్స్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.