మీ ఫోన్‌లోని టిక్‌టాక్ ఏమవుతుందంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఫోన్‌లోని టిక్‌టాక్ ఏమవుతుందంటే..!

June 30, 2020

Government banned chinese tik tok application

భారత ప్రభుత్వం చైనాకు చెందిన టిక్​టాక్ తో సహా 59 యాప్స్​ను నిషేధించిన సంగతి తెల్సిందే. దీంతో టిక్​టాక్​ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ తొలగించింది. అయితే, ఇప్పటికే టిక్​టాక్​ను ఇన్​స్టాల్​ చేసుకున్న వారి పరిస్థితేంటి? ఆ యాప్​ పని చేస్తుందా? లేదా దాన్ని వెంటనే అన్​ఇన్​స్టాల్ చేసేయాలా? ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందా? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ క్రమంలో 59 యాప్స్​తో చైనా.. భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయని తెలుస్తోంది. బ్యాన్​ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఈ యాప్స్​ ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్​ చేయకుండా బ్లాక్ చేస్తాయి. బ్యాన్​ చేసిన యాప్స్ అన్నీ దాదాపు ఆన్​లైన్​లో పని చేసేవి కాబట్టి ఇప్పటికే ఆయా ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్న యాప్స్ ఇకపై పని చేయవు. ఇండియాలో ఉన్న అన్నీ యాప్స్ స్టోర్స్ ఏ యాప్​కూ అప్​డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్​ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ.