నర్సింగ్ సీట్ల భర్తీపై కీలక నిర్ణయం.. ఇక నుంచి కొత్త పద్ధతిలో - MicTv.in - Telugu News
mictv telugu

నర్సింగ్ సీట్ల భర్తీపై కీలక నిర్ణయం.. ఇక నుంచి కొత్త పద్ధతిలో

April 26, 2022

నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. జీవో ప్రకారం నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సును ఎంసెట్‌లో చేర్చాలని వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి లేఖ రాశారు.

కాగా, తెలంగాణలో సుమారు 90 కాలేజీల్లో ఐదు వేల బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నర్సింగ్ కోర్సులకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు. అంకిత భావం, సేవాభావంతో పనిచేస్తే ఈ రంగంలో సులువుగా రాణించవచ్చని సూచించారు. కరోనా వచ్చినప్పుడు వైరస్ సోకిన వ్యక్తి వద్దకు సొంత కుటుంబ సభ్యులే రాలేదని, కానీ, నర్సులు ధైర్యం చేసి వృత్తి ధర్మాన్ని చాటారని ప్రశంసించారు.