మునుగోడు ఉద్యోగులకు స్పెషల్... ఒకటో తేదీనే జీతాలు - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడు ఉద్యోగులకు స్పెషల్… ఒకటో తేదీనే జీతాలు

November 2, 2022

Government employees of Yadadri Bhuvanagiri and Nalgonda districts received their salaries on the 1st November

మునుగోడు ఉప ఎన్నికల వేళ ఓట్ల కోసం జనాలను ఆకట్టుకునేందుకు చేసే ప్రచారం నిన్నటితో ముగిసింది. పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడడం చర్చనీయాంశమైంది. కారణం కేవలం ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్న నిన్న జీతాలు పడ్డాయ్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ఉద్యోగులకు మాత్రం అలాంటి తీపి కబురు చెప్పే ఫోన్ సందేశాలేవీ రాలేదు. ప్రభుత్వం ఉప ఎన్నికలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు పొందేందుకు ఒకటో తేదీన వేతనాలు అందజేసిందని మిగతా వారంతా చర్చించుకుంటున్నారు.

మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ బ్యాంకు అకౌంట్‌లలో శాలరీలు క్రెడిట్ అయినట్లు సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు రావడంతో ఈ  రెండు  జిల్లాల్లోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. వేతనాలు ఏ రోజు వేస్తారో..? అని ఎదురుచూస్తున్న వారికి ఒకటో తేదీనే ఖాతాల్లో పడిపోవడంతో, ఉద్యోగులంతా ఒకటో తారీఖు వేతనాలు రాక ఎన్నేళ్లు అయిందోనని చర్చించుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా కరెక్టుగా ఒకటో తేదీన జీతాలు పడేవి. మూడేళ్లుగా ఒకటో తేదీ నుంచి 10వ తేదీ లోపు ఉద్యోగులకు వేతనాలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకో రెండు జిల్లాల చొప్పున వేతనాలు అందుతున్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత 1 వ తేదినే జీతాలు అందడంతో మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఉద్యోగులు.