ఫోన్ వాడకంపై హైకోర్టు తీర్పు.. ఉద్యోగులకు షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ వాడకంపై హైకోర్టు తీర్పు.. ఉద్యోగులకు షాక్

March 15, 2022

fbdfb

ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ పనివేళల్లో ఫోన్ వాడకంపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆఫీసులో ఉన్నప్పుడు వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్స్ వాడకూడదని సూచించింది. దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించాలని, అతిక్రమించిన వారిపై చర్యలు కూడా అందులో పొందుపరచాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ‘ ఆఫీసుల్లో ఫోన్ల వినియోగం, వీడియోలు తీయడం వంటివి ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. దీంతో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది క్రమశిక్షణ పాటించాలి. ఫోన్లను సైలెంట్‌లో పెట్టడమో లేకపోతే స్విచ్ఛాప్ చేయడమో చేయాలి. తప్పనిసరి సందర్భాలలో అధికారుల అనుమతితో కార్యాలయం నుంచి బయటికెళ్లి మాట్లాడాలి’ అంటూ వ్యాఖ్యానించింది.