రిటైరయిన అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగం.. సీఎం ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

రిటైరయిన అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగం.. సీఎం ప్రకటన

June 21, 2022

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్ధులు ఆందోళన చెందుతున్న తరుణంలో హర్యానా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. నాలుగేళ్లు సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు ప్రభుత్వం ఉద్యోగాలిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘సైన్యంలో పనిచేసిన వారికి మా ప్రభుత్వంలో గ్యారంటీ ఉద్యోగాలు ఇస్తాం. జాబ్ కావాల్సిన వారు గ్రూప్ సీ కేటగిరీలో చేర్చుకుంటాం. కాదంటే పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చు’ అని తెలిపారు. ఇప్పటికే చాలా ప్రైవేటు కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇచ్చాయి. మహీంద్రా, టాటా, బయోకాన్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి భారీ కంపెనీలు మాజీ అగ్నివీరులను తీసుకునేందుకు ముందుకు వచ్చాయి. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్ధుల ఆందోళనలు తగ్గించడానికి పలు సవరణలు, సహాయక చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హర్యానా ప్రకటించడం సంచలనమైంది.