రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల పరిధిలో ఉన్న ఖాళీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన, బోధనేతర ఉద్యోగాలను ఇక నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన ‘కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా భర్తీ చేయాలని డిసైడ్ చేసింది. ఇన్నాళ్లూ సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం చివరికి ఈ నిర్ణయానికి వచ్చింది. బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఉంటారు. సభ్యులుగా విద్యాశాఖ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఉంటారు. కన్వీనర్‌గా కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉంటారు. ఇక నుంచి వర్సిటీలలోని ఖాళీల వివరాలు, భర్తీ వంటివి ఈ బోర్డే చేస్తుంది. వీటి నుంచి మెడికల్ యూనివర్సిటీలను మినహాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.