కేంద్రం షాకింగ్ నిర్ణయం.. పెరగనున్న వంటనూనె ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. పెరగనున్న వంటనూనె ధరలు

November 1, 2022

modi oil

వంటనూనెల ధరలు పెరిగి మొన్నటి వరకు వంటిల్లు బడ్జెట్ పెరిగిపోయి సామాన్యులు, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయంగా తగ్గిన ధరల మేరకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవడంతో ధరలు కొంత అదుపులోకి వచ్చాయి. అయితే కేంద్రం ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఎక్కువగా వినియోగించే, ప్రధానంగా దిగుమతులపై ఆధారపడిన పామాయిల్ ధరలు పెరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌పై ఉన్న దిగుమతి సుంకం 6 శాతం నుంచి 11 శాతానికి పెంచేసింది. ఓ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది.

సుంకం పెరుగుదలతో ఆయిల్ ధరలు పెరిగి వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. డాలర్లలో చూస్తే ఈ పెంపు టన్ను క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకం 858 డాలర్లు నుంచి 952 డాలర్లకు పెరిగింది. అలాగే ఆర్‌బీడీ పామాయిల్ దిగుమతి టారిఫ్ కూడా పెంచేసింది. ఇదివరకు 905 డాలర్లు ఉండగా, ఇప్పుడు 962 డాలర్లకు చేరింది. ఇతర పామాయిల టారిఫ్ కూడా 882 నుంచి 957కి పెంచుతున్నట్టు వివరించింది. ఇక బంగారంపై విధించే టారిఫ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ వెండికి మాత్రం ఒక డాలరు పెరిగింది. కేజీ వెండికి దిగుమతి సుంకం 630 డాలర్లు ఉంది. బంగారంపై మాత్రం 531 డాలర్లే ఉంది. కేంద్రం ప్రతి రెండు వారాలకు ఒకసారి దిగుమతి సుంకాలను సవరిస్తూ ఉంటుంది. ఈ సారి ఆయిల్ సుంకం పెంచడంపై అంతర్జాతీయంగా ధరలు పెరగడం కారణమని చెప్తున్నారు. కాగా, ప్రపంచంలోనే మన దేశం ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశంగా పేరు గాంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో పామాయిల్ సాగు గణనీయంగా పెరిగింది. కానీ, పంట చేతికొచ్చేసరికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో పామాయిల్ కోసం దిగుమతులపై ఆధారపడడం తప్పట్లేదు.