Government of Maharashtra ordered to use Vande Mataram instead of Hello
mictv telugu

ఇకనుంచి ఫోన్‌లో హలో అనకూడదు.. ఆ పదమే పలకాలి : ప్రభుత్వం ఉత్తర్వులు

October 2, 2022

ఫోన్ ఎత్తగానే ఎవరైనా ఏం చేస్తారు. ముందు హలో అంటారు. ఫోన్‌తో పాటు ఈ పదం పాశ్చాత్యుల నుంచే వచ్చింది. దశాబ్దాలుగా ఈ పదం ప్రజల నోళ్లలో నానుతూ వస్తోంది. అసంకల్పితంగానే ఫోన్లో హలో అనడానికి అలవాటయిపోయాం. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక నుంచి హలో అంటే ఒప్పుకోదు. ఆ పదానికి బదులు ‘వందేమాతరం’ అని పలకాలని ఆదేశించింది. ఇందుకోసం ఏకంగా జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సాయంతో నడిచే సంస్థల ఉద్యోగులు, వారితో పని ఉండి ఫోన్ చేసే ప్రజలు ఇలా అందరూ హలో బదులు వందేమాతరం అనాలని సాధారణ పరిపాలన శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, ఉన్నతాధికారుల మధ్య ఫోన్ సంభాషణలు చేసేటప్పుడు కూడా ఇదే పదాన్ని వాడాలని ఉత్తర్వులలో పేర్కొంది. వందేమాతరం అనే పదం వల్ల జాతీయ భావం పెంపొందుతుందని, హలో అంటే ఏంటో ఎవరికీ అర్దం కాదని ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. మరి ఈ పదాన్ని జనాలు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూడాలి.