ఏపీ : జిల్లా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : జిల్లా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

May 18, 2022

ఏపీ వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే స్థానికంగా పేరున్న నాయకుల పేర్లను కొన్ని జిల్లాలకు ప్రభుత్వం పెట్టింది. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లను ఆయా జిల్లాలకు ప్రభుత్వం పెట్టింది. ఈ క్రమంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో వారి కోరిక మేరకు కోనసీమ జిల్లాను డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.