రాబోయే రోజుల్లో గజ్వేల్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం గజ్వేల్‌లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న విశ్వకర్మ సంఘ భవన నిర్మాణం, వీర భద్రీయ కుల సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ నుంచి తిరుపతికి త్వరలోనే రైళ్లు నడుస్తాయని ఎవరూ ఊహించలేదని, అది త్వరలో జరుగబోతుందని హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ దశ, దిశ మారిందని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేలుగా పని చేసిన సంజీవరావు, విజయ రామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డిల హయాంలో ఒకప్పుడు గుక్కెడు మంచినీటి కోసం గోసపడ్డ గజ్వేల్ ఇవాళ సీఎం కేసీఆర్ హయాంలో దశ, దిశ మారిందన్నారు.