గుడ్ న్యూస్ : యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్ : యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం

April 14, 2022

ppppp

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్న వేళ నిరుద్యోగుల వయోపరిమితిని మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వయోపరిమితి సడలింపు రెండేళ్ల పాలు అమలులో ఉంటుందని తెలిపింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖల ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించనుంది. దీని వల్ల మరింత మంది నిరుద్యోగులకు మేలు జరుగనుంది. కాగా, ఇప్పటికే మిగతా ఉద్యోగాలకు వయో పరిమితి పెంచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 30, 453 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ పచ్చజెండా ఊపింది. వీటిలో ఎక్సైజ్, అటవీ, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంచడం గమనార్హం.