పదో తరగతి హాల్ టిక్కెట్ల విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

పదో తరగతి హాల్ టిక్కెట్ల విడుదల

April 19, 2022

03

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను విడుదల చేసినట్టు ఎగ్జామ్ కన్వీనర్ దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. హాల్ టిక్కెట్లను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టామని వెల్లడించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకొని వాటిపై తమ సంతకాలు చేసి విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్ధుల ఫోటోలు సరిగ్గా లేకపోతే సరిచేసి వాటిపై సంతకాలు చేసి ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయా వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందించాలని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది.