ఆధార్‌లో ఇక భర్త, తండ్రి కనిపించరు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్‌లో ఇక భర్త, తండ్రి కనిపించరు.. 

September 6, 2021

Government removed of the father / husband in the Aadhaar card

అందరూ ఉప‌యోగించే అతి ముఖ్య‌మైన ధృవ‌ప‌త్రాల‌లో ఆధార్ కార్డు ఒక‌టి. అన్ని ర‌కాల ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. తాజాగా ఆధార్ కార్డులో ప‌లు కీల‌క మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆధార్ కార్డును అప్ డేట్ చేస్తే ఇక‌పై అందులో తండ్రి / భ‌ర్త పేరు అని అండ‌దు. సంర‌క్ష‌కుడికి, కార్డుదారుడికి మ‌ధ్య ఉన్న‌ బంధుత్వాన్ని తెలిపే అవ‌కాశం ఉండ‌దు. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేక‌ భర్త అనే ఆప్ష‌న్ వ‌ద్ద కేరాఫ్ అనే ప‌దం మాత్ర‌మే ఉంటుంది.

 ఆధార్‌లో త‌ప్పులు ఉంటే కార్డుదారుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని స‌రిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాల‌కు వెళ్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఓ ఖాతాదారుడు ఈ విష‌యాన్ని గుర్తించి ఆధార్‌కార్డులో పొరపాటుగా కేరాఫ్ అని ప‌డిందేమో అనుకుని ఆధార్ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే తండ్రి పేరు, భర్త పేరు అనే ప‌దాల‌ను తొల‌గించి కేరాఫ్ అని ఉద్దేశ‌పూర్వ‌కంగానే మార్చామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

 ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాన్ని తెలిపే ప‌దాలు ఉండ‌బోవ‌ని, కేరాఫ్ అని మాత్ర‌మే ఉంటుందని.. కార్డుదారుడు కేరాఫ్ లో త‌న సంర‌క్ష‌కుడి పేరును రాస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. పౌరుడి వ్య‌క్తిగ‌త‌ గోప్యత‌కు ఏ విధమైన‌ భంగం కలగ‌కూడ‌ద‌ని.. గ‌తంతో సుప్రీం కోర్టు చేసిన సూచ‌న‌ల మేర‌కు అధికారులు ఈ మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.