హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం కొత్తగా 13 పోలీస్ స్టేషన్లను మంజూరు చేసింది. దోమలగూడ, వారాసి గూడ, ఐఎస్ సదన్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, తాడ్‌బన్, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, బండ్లగూడ, టోలీచౌకి, గుడి మల్కాపూర్, మాసబ్ ట్యాంక్, బోరబండలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆరు జోన్లలో తలా ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్‌ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్తగా 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను బహదూర్ పురా, సంతోష్ నగర్, చాంద్రాయణ గుట్ట, టోలీచౌకి, లంగర్ హౌజ్, నారాయణ గూడ, నల్లకుంట, మారేడుపల్లి, బోయిన్ పల్లి, ఎస్ఆర్ నగర్, అంబర్ పేట, చిలకలగూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో ఇన్స్‌పెక్టర్లు, ఇతర సిబ్బందిని త్వరలో నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.