నిన్న జరిగిన ధర్నా చౌక్ గొడవలో వివాదాస్పదం అయిన లేక్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీదేవిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పొద్దున ధర్నా చౌక్ లో ప్లకార్డులు పట్టుకుని కూర్చున్న శ్రీదేవి విజువల్స్ మీడియా ఛానళ్లలో రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
పోలీసులు ధర్నా చేయడం ఏంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. దీంతో స్పందించిన పోలీస్ శాఖ శ్రీదేవిని విధుల నుంచి తప్పించింది. ఈ మొత్తం వ్యవహారంపై డిసిపి జోయల్ డేవిస్ విచారణ జరుపుతున్నారు. ధర్నాలో కూర్చున్న మహిళా కానిస్టేబుళ్ల ను కూడా వివరణ కోరినట్టు డిసిపి చెప్పారు.
HACK:
- Government to take action on Lake Police station lady CI Sri Devi.